KTR: కేటీఆర్ సార్.. అభినందనలు: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

  • కేటీఆర్ కి అభినందనలు తెలుపుతూ సానియా పోస్ట్
  • సిరిసిల్ల నుంచి భారీ మెజార్టీతో కేటీఆర్ విజయం
  • ఇప్పటికే కేటీఆర్ ని అభినందించిన పలువురు నేతలు

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తిరుగులేని ఆధిక్యతతో కేటీఆర్ విజయం సాధించడంపై ఇప్పటికే పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఫోన్ కాల్స్, మెస్సేజ్ ల ద్వారా ఆయన్ని అభినందించారు. ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ‘కేటీఆర్ సార్.. అభినందనలు’ అంటూ ఓ ట్వీట్ చేశారు. కాగా, సిరిపిల్లలో తన సమీప ప్రత్యర్థి కె.కె.మహేందర్ రెడ్డిపై 88,886 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ విజయం సాధించారు.

More Telugu News