TJS: కనీసం ఖాతా కూడా తెరవలేకపోయిన టీజేఎస్!

  • తొలుత 13 స్థానాలో పోటీ
  • 5 స్థానాల్లో ఉపసంహరణ
  • 8 స్థానాల్లో పోటీ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు కూడా ఓటమి పాలవడం విశేషం. ఇక ఈ ఎన్నికల్లో కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి కూడా పోటీ చేసింది. కానీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేసింది. మొదట 13 స్థానాల నుంచి టీజేఎస్ పోటీ చేసినప్పటికీ తరువాత 5 చోట్ల ఉపసంహరించుకుంది.

More Telugu News