sensex: లాభాల్లో మార్కెట్లు.. ప్రభావం చూపని ఎన్నికల ఫలితాలు!

  • ఐటీ, ఫార్మా స్టాకుల్లో కొనుగోళ్ల జోరు
  • 190 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 61 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ఈరోజు ఐదు రాష్ట్రాలకు ఎన్నిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలు ఈనాటి ట్రేడింగ్ పై ప్రభావం చూపకపోవడం గమనార్హం. బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే, మార్కెట్లపై ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. కానీ, దానికి భిన్నంగా మార్కెట్లు ఈరోజు గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. ఐటీ, ఫార్మా స్టాకుల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో, మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 35,150కి ఎగబాకింది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 10,549కి చేరుకుంది.

టాప్ గెయినర్స్:
క్వెస్ కార్ప్ (11.73%), ఈఐహెచ్ లిమిటెడ్ (10.22%), కార్పొరేషన్ బ్యాంక్ (9.80%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (7.76%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (7.62%).

టాప్ లూజర్స్:
వక్రాంగీ (-4.88%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.72%), ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-4.31%), శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (-3.28%), హిందుస్థాన్ పెట్రోలియం (-2.74%).      

More Telugu News