Telangana: 'ఈవీఎంలను ట్యాంపర్ చేశారు'... అని అనేందుకు కూడా వీలులేని పరిస్థితుల్లో కాంగ్రెస్!

  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం
  • రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో అధికార పార్టీకి ఓటమి ఖాయం
  • ఈవీఎంలను ఎత్తి చూపలేకపోతున్న కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఖాయమైంది. దాదాపు 90 సీట్లకు పైగా టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించనుండగా, విమర్శించేందుకు కాంగ్రెస్ కు మాటలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి ఖరారైన తరువాత, సదరు పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, అధికార పార్టీ రిగ్గింగ్ కు పాల్పడిందని విమర్శలు చేయడం సర్వసాధారణం.

కానీ, తెలంగాణలో మాత్రం ఇంకా మీడియా ముందుకు ఎవరూ రాలేదు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని విమర్శించాలంటే, ఇదే సమయంలో ఎన్నికలు జరిగిన మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎదురీదుతున్న పరిస్థితి నెలకొందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని ఖాయం చేసుకున్న నేపథ్యంలో, ఈవీఎంలపై నెపం నెట్టే ధైర్యాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేయలేకపోతున్నారన్న భావన నెలకొంది.

More Telugu News