venkatesh: 'ఎఫ్ 2' నుంచి ఫస్టు టీజర్ వచ్చేస్తోంది

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • రేపు సాయంత్రం 5 గంటలకు ముహూర్తం
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు           

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను వదలనున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే అనిల్ రావిపూడి వున్నాడు. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇంతవరకూ అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఈ సినిమా కూడా ఆయన హిట్ చిత్రాల జాబితాలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.          

More Telugu News