ప్రజాకూటమికి తొలి ఓటమి.. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఘోరపరాజయం!

11-12-2018 Tue 10:17
  • ఘనవిజయం సాధించిన డా.సంజయ్
  • నాగార్జునసాగర్ లోనూ కాంగ్రెస్ వెనుకంజ
  • తప్పిన లగడపాటి సర్వే అంచనాలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి ఓటమి ఎదురయింది. ఈ ఎన్నికల్లో జగిత్యాల ప్రజాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో 60,676 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కాగా, ఫలితాలు వెలువడకముందే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెనుదిగిగారు.

మరోవైపు నాగార్జున సాగర్ లోనూ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై నోముల నర్సింహయ్య వెయ్యి ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు. ఇదిలావుంచితే, ప్రజాకూటమి తరఫున జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని లగడపాటి రాజగోపాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇటీవల ఫోన్ చేసిన లగడపాటి ‘మీరు మంత్రి కాబోతున్నారు.. కంగ్రాట్స్’ అని చెప్పారు.