vijay mallya: విజయ్ మాల్యాను ప్లేబోయ్‌గా అభివర్ణించిన లండన్ కోర్టు

  • మాల్యాను అందగాడంటూ పొగిడిన కోర్టు
  • ఆర్థర్ జైలులో అతడి హక్కులకు భంగం కలగదన్న న్యాయస్థానం
  • ముస్తాబవుతున్న ఆర్థర్ రోడ్డు జైలు

భారత్‌లోని బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర ముంచేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ సందర్బంగా విజయ్ మాల్యాపై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విజయ్ మాల్యా అందగాడు, సొగసుకాడు, ప్రముఖుడు, బిలియనీర్ ప్లేబోయ్ అంటూ మాల్యాను అభివర్ణించింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో తన హక్కులకు భంగం వాటిల్లుతుందన్న మాల్యా ఆందోళనను కోర్టు కొట్టిపడేసింది. మాల్యా హక్కులకు అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పింది.

భారత్‌కు అప్పగిస్తున్నట్టు కోర్టు తీర్పు చెబుతూనే హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 14 రోజుల గడువు ఇచ్చింది. మరోవైపు, మాల్యాపై లండన్ కోర్టు తీర్పును మోదీ ప్రభుత్వం ఘన విజయంగా పేర్కొంది. అతడి కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలును సిద్ధం చేస్తున్నారు.

More Telugu News