Congress: చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ జోరు.. తాజా పరిస్థితి ఇదే!

  • స్పష్టమైన ఆధిక్యంలో కాంగ్రెస్
  • వెనకబడిన బీజేపీ
  • వాజ్‌పేయి మేనకోడలుపై రమణ్ సింగ్ ఆధిక్యం

చత్తీస్‌గఢ్‌లో గెలుపుపై ధీమాగా ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12, బీఎస్పీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిలాస్‌పూర్‌లో వాణిజ్యశాఖా మంత్రి అమర్ అగర్వాల్ ఆధిక్యంలో కొనసాగుతుండగా కోబ్రా నియోజకవర్గంలో జైసింగ్ అగర్వాల్ ఆధిక్యంలో ఉన్నారు.

 ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లపై ఆధిక్యంలో ఉన్నారు. గోండ్వానాలో గణతంత్ర పార్టీ అభ్యర్థి హిరా సింగ్ మక్రం ఆధిక్యంలో ఉన్నారు. ఖరాసియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేశ్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు.

More Telugu News