Maha kutami: ఉర్జిత్ అందుకే రాజీనామా చేశారు.. ఢిల్లీలో మహాకూటమి నేతల ఆరోపణ

  • ఆ సొమ్మును కేంద్రానికి మళ్లించాలంటూ ఒత్తిడి
  • ‘కాగ్’ను కూడా నియంత్రిస్తున్నారు
  • సమావేశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా చానళ్లను అడ్డుకున్నారు

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ అర్థాంతరంగా రాజీనామా చేయడంపై ఢిల్లీలో సమావేశమైన ‘మహాకూటమి’ నేతలు చర్చించారు. కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిళ్లు భరించలేకే ఆయన రాజీనామా చేసి ఉంటారని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్బీఐ వద్ద ఉన్న రూ.3.50 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వానికి మళ్లించాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని, అవి భరించలేకే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఆరోపించారు.

ప్రభుత్వ సంస్థలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నియంత్రిస్తోందని కూటమి నేతలు ఆరోపించారు. కాగ్ వంటి స్వతంత్ర సంస్థనూ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ నివేదిక ఇవ్వకుండా కాగ్‌పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. మాజీ ప్రధానులు సహా దేశంలోని ముఖ్య నేతలందరూ సమావేశమైతే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా టీవీ చానళ్లను నియంత్రించారని, మోదీ నియంతృత్వ పాలనకు ఇంతకంటే ఉదాహరణ మరోటి ఉండదని కూటమి నేతలు ధ్వజమెత్తారు. పోరాటాలు, ఉద్యమాల ద్వారా కేంద్రం అవినీతిని వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కూటమి నేతలు తీర్మానించారు.

More Telugu News