Gunjan suksena: దుల్కర్, జాన్వీ జంటగా బయోపిక్!

  • గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా చిత్రం
  • గుంజన్.. తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌
  • ప్రధాన పాత్రలో నటించనున్న జాన్వి

తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా గురించి చర్చించేందుకు జాన్వి.. గుంజన్‌ను కూడా కలిశారట. కాగా, ఈ చిత్రంలో జాన్వీకి జోడిగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారని సమాచారం. బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన దుల్కర్.. ఈ చిత్రంలో నటిస్తే మూడోది అవుతుంది. ఎన్నో సాహసాలకు నెలవైన గుంజన్ జీవిత కథను కరణ్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

More Telugu News