Khammam: పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించలేదని ఖమ్మంలో ఉద్యోగుల ఆందోళన

  • పోస్టల్ బ్యాలెట్ ఓటు కల్పించడంలో నిర్లక్ష్యం
  • విధులకు హాజరుకాని వారికి షోకాజ్ నోటీసులు
  • ఓటు హక్కు వినియోగించుకోనివ్వలేదు

మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఓట్ల లెక్కింపు మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ పోస్టల్ బ్యాలెట్లను కాజేశారంటూ ఒకచోట.. తమకు పోస్టల్ బ్యాలెట్ అవకాశమే కల్పించలేదంటూ మరోచోట ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మంలో ఎన్నికల సిబ్బంది తమకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించలేదంటూ నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

ఎన్నికల విధులకు హాజరుకాని వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు.. తమకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓటు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తాము పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ ఎన్నికల కమిషన్ తమ ఓటు హక్కును వినియోగించుకోనివ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రారంభమయ్యే లోపు తమకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News