congress: ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసింది: రాహుల్ గాంధీ

  • పెద్దనోట్ల రద్దు వంటి చర్యలకు వ్యతిరేకంగా పోరాడతాం
  • బీజేపీ ఓటమికి కలిసి పనిచేయాలని నిర్ణయించాం 
  • బీజేపీ యేతర పార్టీల సమావేశం అనంతరం రాహుల్

ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ యేతర పార్టీల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగ సంస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీయే.. సీబీఐ, ఆర్బీఐ, ఈసీ వంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. బీజేపీ అవినీతి, రాఫేల్ విమానాల కొనుగోలులో అక్రమాలపై చర్చించామని అన్నారు. పెద్దనోట్ల రద్దు వంటి చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని, బీజేపీ ఓటమికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు రాహుల్ తెలిపారు.

More Telugu News