konda visvesar reddy: జనార్దన్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవమే.. కానీ ఆ ఆరోపణలు నిజం కాదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • ఫోన్ చేసినంత మాత్రాన బేరసారాలకేనా?
  • ఒక ఫోన్ కాల్ చేస్తేనే టీఆర్ఎస్ నేతలు అమ్ముడుపోతారా?
  • సీ-ఓటర్, లడగపాటి సర్వేలను మాత్రమే నేను నమ్ముతా 

టీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూల్ నియోజక వర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు.

ఫోన్ చేసినంత మాత్రాన బేరసారాలకే అని ఎందుకు అనుకుంటారు? కేవలం, ఒక ఫోన్ కాల్ చేస్తేనే టీఆర్ఎస్ నేతలు అమ్ముడుపోతారా? అని ప్రశ్నించారు. మర్రి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, అయితే ఓటింగ్ గురించి మాత్రమే ఆయన్ని అడిగానని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి నేతలను లాగే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని, నాడు 63 మంది అభ్యర్థులతో విజయం సాధించిన టీఆర్ఎస్ లో ఈరోజు 90 మంది సభ్యులు ఎలా ఉన్నారని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనందునే, ఎంఐఎంతో చర్చలు జరుపుతోందని వ్యాఖ్యానించిన విశ్వేశ్వర్ రెడ్డి, సీ-ఓటర్, లడగపాటి సర్వేలను మాత్రమే తాను నమ్ముతానని అన్నారు.

More Telugu News