vijay malya: విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ.. మాల్యాను భారత్ కు అప్పగించాలని ఆదేశాలు!

  • నేడు తీర్పును వెలువరించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు
  • మాల్యా ఐడీబీఐ బ్యాంక్ కు తప్పుడు పత్రాలు సమర్పించారు
  • మాల్యాకు 14 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించిన కోర్టు

భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను ఇండియాకు తిరిగి పంపే విషయంలో వెస్ట్ మినిస్టర్ కోర్టు నేడు తీర్పును వెలువరించింది. మాల్యాను భారత్ కు అప్పగించాలనే వాదనను కోర్టు సమర్ధించింది. మాల్యాను భారత్ కు అప్పగించాలని ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాల్యా ఐడీబీఐ బ్యాంక్ కు తప్పుడు పత్రాలు సమర్పించారని, వాస్తవాలను వక్రీకరించారని  జడ్జి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు అవకాశం కల్పించింది. 

More Telugu News