stock market: ఎగ్జిట్ పోల్స్ ప్రకంపనలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • మరింత బలహీనపడ్డ రూపాయి
  • 713 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 205 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ట్రేడింగ్ పై ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీనికి తోడు అంతర్జాతీయ బలహీన సంకేతాలు, మరింత బలహీన పడిన రూపాయి విలువ కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో, మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 713 పాయింట్లు పతనమై 34,959కి పడిపోయింది. నిఫ్టీ 205 పాయింట్లు కోల్పోయి 10,488కి దిగజారింది.

టాప్ గెయినర్స్:
టెక్స్ మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ (5.58%), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (4.84%), అశోకా బిల్డ్ కాన్ (4.45%), డీబీ కార్ప్ (3.73%), కావేరీ సీడ్ కంపెనీ (3.61%).

టాప్ లూజర్స్:
ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (-10.14%), ఎన్సీఎల్ ఇండియా (-7.43%), మాగ్మా ఫిన్ కార్ప్ (-7.37%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (-7.13%), జెట్ ఎయిర్ వేస్ (-6.77%).      

More Telugu News