mohanalal: మనసును తాకుతోన్న 'ఒడియన్' సాంగ్

  • వైవిధ్యభరితమైన కథాకథనాలు 
  • ఆకట్టుకుంటోన్న సంగీతం 
  • ఈ నెల 14వ తేదీన విడుదల    

ఇప్పుడు మోహన్ లాల్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'ఒడియన్' కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. మంజు వారియర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మలయాళంతోపాటు తెలుగులోను ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి "నా కళ్లు .. కళ్లు .." అంటూ సాగే ఒక మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. హృద్యమైన సంగీతంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. మోహన్ లాల్ .. మంజు వారియర్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. ఇంతవరకూ మోహన్ లాల్ చేసిన వైవిధ్యభరితమైన చిత్రాలలో ఇదొకటనీ, మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

More Telugu News