Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కృష్ణా జలాలపై పిటిషన్ కొట్టివేత!

  • గతంలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • కర్ణాటక, మహారాష్ట్రలను కూడా చేర్చాలని వినతి
  • ఏపీ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించిన విచారణలో తమతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వాదనలు వినాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ కేసులో మహారాష్ట్ర, కర్ణాటకల వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఉమ్మడి ఏపీ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినందున ఈ రెండు రాష్ట్రాల వాదనలు మాత్రమే వింటామని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో ఏపీ, తెలంగాణ వాదనలు వింటే చాలని ఇంతకుముందు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తాజాగా కోర్టు నిర్ణయంతో కృష్ణా జలాల పంపకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగనున్నాయి.

More Telugu News