vijay: క్రీడారంగంలోని రాజకీయాలపై విజయ్ పోరాటం

  • సందేశంతో కూడిన కథలు 
  • సంచలన విజయాలు 
  • క్రీడాకారుడి పాత్రలో విజయ్  

ఈ మధ్య కాలంలో విజయ్ వరుస విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ సినిమాల్లో ఆయన వినోదంతోపాటు సందేశం కూడా ఉండేలా చూసుకోవడం విశేషం. ఒక్కో సమస్య చుట్టూ తిరిగే కథను ఎంచుకుని .. ఆ సమస్యకి తగిన పరిష్కారాన్ని చూపుతూ తన సినిమాలు ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'కత్తి' .. 'తుపాకి' .. 'మెర్సల్' .. 'సర్కార్' సంచలన విజయాలను సాధించాయి.

దాంతో ఆయన తదుపరి సినిమా కూడా సందేశంతో కూడినదిగానే ఉండనుంది. విజయ్ తన తదుపరి సినిమాను అట్లీ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా క్రీడారంగంలోని రాజకీయాల చుట్టూ తిరుగుతుందట. క్రీడారంగాన్ని రాజకీయాలు ప్రభావితం చేయడం వలన, ప్రతిభ కలిగినవారికి అవకాశాలు ఎలా దూరమవుతున్నాయనేది ఈ సినిమాలో చూపించనున్నారని అంటున్నారు.  

More Telugu News