rajani: 150 కోట్ల క్లబ్ లోకి చేరిన '2.ఓ' హిందీ వెర్షన్ వసూళ్లు

  • అక్షయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లు
  • అనువాద చిత్రాల్లో 2వ స్థానం 
  • ఈ ఏడాదిలో వచ్చిన హిందీ చిత్రాల్లో 6వ స్థానం      

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' .. విడుదలైన ప్రతి ప్రాంతంలోను తన జోరును కొనసాగిస్తోంది. తెలుగు .. తమిళ ..హిందీ భాషల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. 10 రోజుల వసూళ్లతో ఈ సినిమా హిందీ వెర్షన్ 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన అనువాద చిత్రాల్లో ఈ సినిమా 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రాలలో 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం పూర్తయ్యేనాటికి ఈ సినిమా హిందీ వెర్షన్ 154.75 కోట్లను వసూలు చేసింది. ఇప్పటికే హిందీ వెర్షన్ వసూళ్లు తగ్గుముఖం పడుతుండటంతో, ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని తాకడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్షయ్ కుమార్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా '2.ఓ' నిలవడంపట్ల ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News