varun tej: దూసుకుపోతోన్న 'అంతరిక్షం' ట్రైలర్

  • ప్రయోగాత్మక చిత్రంగా 'అంతరిక్షం'
  • ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల  

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'అంతరిక్షం' సినిమా రూపొందింది. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో లావణ్యత్రిపాఠి .. అదితీరావు కనిపించనున్నారు. వరుణ్ తేజ్ తో పాటు వ్యోమగామిగా అదితీరావు .. పార్వతీ టీచర్ గా లావణ్య త్రిపాఠి నటించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ ను రాబట్టగా, 100K లైక్స్ లభించాయి. అలా యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ ట్రైలర్ నెంబర్ వన్ పొజీషన్లో నిలిచింది. సత్యదేవ్ .. రెహ్మాన్ (రఘు) ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు. ఇక ఇటీవల కథానాయికల రేసులో కాస్త వెనుకబడిన లావణ్య త్రిపాఠి కూడా, ఈ సినిమా సక్సెస్ పైనే ఆశలు పెట్టుకుంది.     

More Telugu News