Rajasthan: ఆధిపత్యం కోసం పులుల పోరు... 27 రోజుల తరువాత మరణించిన పెద్దపులి!

  • రాజస్థాన్ లోని అల్వర్ జిల్లాలో ఘటన
  • ఎస్టీ-4, ఎస్టీ-6 మధ్య భీకర పోరు
  • చికిత్స అందించినా దక్కని ఫలితం

అరణ్యాల్లో గ్రూపులుగా సంచరించే పులుల మధ్య ఆధిపత్య పోరు జరుగగా, తీవ్రంగా గాయపడిన ఓ పెద్దపులి 27 రోజుల చికిత్స అనంతరం మరణించింది. ఈ ఘటన రాజస్థాన్ లోని అల్వర్ జిల్లా సరిస్కా పులుల అభయారణ్యంలో జరిగింది. ఎస్టీ-4, ఎస్టీ-6 మధ్య భీకర పోరు జరిగిందని అభయారణ్యం అధికారి హేమంత్ సింగ్ వెల్లడించారు.

ఈ పోరులో ఓ పులి తీవ్రంగా గాయపడిందని, విషయం తెలుసుకున్న తాము, దాన్ని బోనులో బంధించి చికిత్స చేయించామని, అయినా ఫలితం దక్కలేదని ఆయన అన్నారు. కాగా, ఈ తాజా ఘటనతో సరిస్కాలో ఈ సంవత్సరం మరణించిన పులుల సంఖ్య మూడుకు పెరిగింది. రెండు పులులను వేటగాళ్లు బలితీసుకున్నారు.

More Telugu News