Andhra Pradesh: హాట్ కేకుగా అమరావతి హ్యాపినెస్ట్ ప్రాజెక్టు.. 15 నిమిషాల్లోనే 662 ఫ్లాట్ల బుకింగ్!

  • సీఆర్డీఏ ఆన్ లైన్ బుకింగ్ కు అనూహ్య స్పందన
  • 69 బ్యాంకులు, మీ సేవ సెంటర్ల ద్వారా ఛాన్స్
  • రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిర్ణయం

అమరావతిలో సామాన్యుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు అనూహ్య స్పందన వస్తోంది. గతంలో కేవలం 300 ఫ్లాట్లను అందుబాటులో ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల కోసం సీఆర్డీఏ రెండో విడతలో 900 ఫ్లాట్లను సిద్ధం చేయగా, ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే 662 ఫ్లాట్లను ప్రజలు కొనుగోలు చేశారు. ప్రజల సౌకర్యార్థం 69 బ్యాంకు శాఖలు, మీ సేవా కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

అంతేకాకుండా సర్వర్ సమస్యలు తలెత్తకుండా వెబ్ సైట్ ను సరళతరం చేశారు. సీఆర్డీఏలో ఓ ప్లాట్ ను సెలక్ట్ చేసుకున్నాక 20 నిమిషాల్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బుకింగ్ రద్దయిపోతుంది. గతంలో ఎదురైన అనుభవాలతో సర్వర్ల సామర్థ్యాన్ని అధికారులు 50 రెట్లు పెంచారు. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, సీఆర్డీఏ హ్యాపీనెస్ట్ బుకింగ్ కు మరోసారి సానుకూల స్పందన రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News