Bollywood: బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం!

  • జాన్వీకి ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’
  • ప్రకటించిన నార్వేజియన్ కాన్సులేట్  
  • ముంబైలో ఎల్లుండి అవార్డు ప్రదానోత్సవం

బాలీవుడ్ యువ బ్యూటీ జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం లభించింది. ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు జాన్వీ ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును ఆమెకు మంగళవారం ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన జాన్వీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.

ఈ అవార్డు తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఈ ఏడాది 'ధడక్' చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టానని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారని తెలిపింది. ఈ సినిమాను వీక్షించిన నార్వే ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. 

More Telugu News