కల్యాణ్‌రామ్‌ ఏం చేస్తున్నారో ఊహించండి..!: నిర్మాత మహేష్ కోనేరు

09-12-2018 Sun 20:02
  • కల్యాణ్‌రామ్ హీరోగా ‘118’
  • నీటిలో డీప్ డైవ్ చేయడంలో శిక్షణ
  • కల్యాణ్‌రామ్‌ను ప్రశంసిస్తున్న నెటిజన్లు
ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కేవీ గుహన్ నేపథ్యంలో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘118’. మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీపాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కల్యాణ్ రామ్ రిస్కీ సన్నివేశాల్లో నటిస్తున్నారట. ఈ విషయాన్ని మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘కల్యాణ్‌రామ్‌ ‘118’ కోసం ఏం చేస్తున్నారో ఊహించండి?’ అని ప్రశ్నించిన మహేష్.. అనంతరం కల్యాణ్ రామ్ నీటిలో డీప్ డైవ్‌ చేయడంలో శిక్షణ తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ‘కల్యాణ్‌రామ్‌ ‘118’ సినిమాలోని వాటర్‌ సీక్వెన్స్‌ కోసం నీటిలో డీప్‌ డైవ్‌ చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు’ అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీడియోను చూసిన నెటిజన్లు కల్యాణ్‌రామ్‌ను ప్రశంసించడమే కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.