ఈశా అంబానీ పెళ్లి వేడుకల్లో అమెరికన్ పాప్ స్టార్ బియాన్స్ నోవెల్స్

09-12-2018 Sun 18:26
  • ఉదయ్ పూర్ కు చేరుకున్న బియాన్స్
  • ఈరోజు రాత్రికి బియాన్స్ బృందం ప్రదర్శన
  • రేపు తిరిగి అమెరికా వెళ్లనున్న బియాన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహం ఆనంద్ పిరమాల్ తో ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివాహానికి ముందు నిర్వహించే వేడుకలు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి.

ఈరోజు వేడుకలకు అమెరికన్ పాస్ సింగర్ బియాన్స్ నోవెల్స్ హాజరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె ఇక్కడకి చేరుకుంది. ఈ రాత్రికి జరగనున్న వేడుకల్లో అరవై మందితో కూడిన బియాన్స్ బృందం ప్రదర్శన ఇవ్వనుంది. ఈ ప్రదర్శన అనంతరం, బియాన్స్ బృందం రేపు తిరిగి అమెరికా వెళ్లనుంది.

కాగా, నిన్న జరిగిన వేడుకలకు అమెరికాలోని డెమోక్రాటిక్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు.