komati reddy: నా లెక్క ప్రకారం ప్రజాకూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే..!: కోమటిరెడ్డి

  • ప్రభుత్వ వ్యతిరేకత వల్లే పోలింగ్ శాతం పెరిగింది
  • జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదు
  • 70 నుంచి 75 స్థానాలను ప్రజాకూటమి గెలుచుకుంటుంది

ప్రజాకూటమి ఘన విజయం సాధించబోతోందనే విషయం పోలింగ్ సరళిని చూస్తేనే అర్థమవుతోందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రానికి టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని... టీఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశంతో హైదరాబాదు నుంచి సొంత ఊళ్లకు వచ్చి ప్రజలు ఓటు వేశారని అన్నారు.

జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను జాతీయ మీడియా ఎక్కువగా పట్టించుకోదని... మన వార్తలు వాటిలో ఎక్కువగా రావని తెలిపారు. వాళ్లకు మన రాష్ట్ర పరిస్థితులపై ఎక్కువ అవగాహన ఉండదని చెప్పారు. పది, పదిహేనేళ్లుగా లగడపాటి రాజగోపాల్ చేస్తున్న సర్వేలన్నీ నిజమయ్యాయని తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనకు తెలంగాణపై పూర్తి అవగాహన ఉందని... ప్రజాకూటమి 70 నుంచి 75 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కేసీఆర్ ఏ విధంగా మళ్లీ సీఎం అవుతారని ప్రశ్నించారు.

More Telugu News