ప్రముఖ సహస్రావధాని గరికపాటి నరసింహారావు సంచలన నిర్ణయం

- ఇకపై ప్రవచనాలకు స్వస్తి
- ఏప్రిల్ నుంచి టీవీ కార్యక్రమాలు, ప్రవచనాలకు దూరం
- ఇకపై ఎక్కువ కాలం మౌనంలోనే..
గరికపాటి నిర్ణయం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ సమాజానికి నాలుగు మంచిమాటలు చెప్పే వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించడం బాధాకరమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయంపై మరోమారు ఆలోచించాలని కోరుతున్నారు. కాగా, గరికపాటి కుమారుడు గురజాడ ఇకపై ప్రవచనాలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.