Teacher: విద్యార్థులు అల్లరి చేస్తున్నారని నోటికి ప్లాస్టర్ వేసిన టీచర్

  • యూకేజీ విద్యార్థుల నోటికి ప్లాస్టర్
  • సీసీ టీవీ కెమెరాలో రికార్డు
  • టీచర్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం

తరగతి గదిలో విద్యార్థులు చేస్తున్న అల్లరితో విసిగిపోయిన ఓ టీచర్ వారి నోటికి ప్లాస్టర్ వేసింది. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు వెలుగు చూడడంతో వివాదాస్పదమైంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నారాయణ ఈ-టెక్నో స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. యూకేజీ విద్యార్థులు అల్లరి చేస్తుండడంతో విసిగిపోయిన టీచర్ నాలుగేళ్ల చిన్నారుల నోటికి ప్లాస్టర్ వేసింది. తల్లిదండ్రుల ఆందోళనతో దిగివచ్చిన స్కూలు యాజమాన్యం టీచర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనను దురదృష్టకర ఘటనగా పేర్కొన్న స్కూలు ప్రిన్సిపాల్ మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

More Telugu News