phone: వినియోగదారుడు కోరితే ఫోన్ ట్యాపింగ్ సమాచారం బయటపెట్టాల్సిందే: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

  • అందుకు, టెలిఫోన్ కంపెనీలు అంగీకరించాలి
  • అంగీకరించని పక్షంలో ట్రాయ్ ఆ సమాచారం ఇవ్వాలి
  • సమాచార హక్కు చట్టం ద్వారా ట్రాయ్ ని అడగొచ్చు

దేశాధి నేతలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రిటీలకు చెందిన ఫోన్ కాల్స్ ట్యాపింగ్ కు గురయ్యాయన్న వార్తలు, ఆరోపణలు వింటూనే ఉన్నాం. ముఖ్యంగా, మన దేశంలో రాజకీయ నాయకుల నుంచి ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా వింటూ ఉంటాం.

ఈ క్రమంలో, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఢిల్లీకి చెందిన న్యాయవాది కబీర్ శంకర్ వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర తీర్పు నిచ్చింది. వినియోగదారుడు కోరితే ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని బయటపెట్టాల్సిందేనని ఆదేశించింది. అందుకు, టెలిఫోన్ కంపెనీలు అంగీకరించని పక్షంలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆ సమాచారాన్ని ఇవ్వాలని తన తీర్పు ద్వారా ఆదేశించింది. సమాచార హక్కు చట్టం ద్వారా ట్రాయ్ ని అలా అడిగే హక్కు వినియోగదారుడికి ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

More Telugu News