eesha ambani: ఈశా అంబానీ వివాహ వేడుకలకు హిల్లరీ క్లింటన్ హాజరు

  • 12న రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈశా అంబానీ పెళ్లి
  • ఈరోజు నుంచి పెళ్లికి ముందు వేడుకలు
  • ఈ వేడుకలకు హాజరైన పలువురు ప్రముఖులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహం ఆనంద పిరమాల్ తో ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివాహానికి ముందు నిర్వహించే వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి.

ఓ రేంజ్ లో జరుగుతున్న ఈ వేడుకలకు అమెరికాలోని డెమోక్రాటిక్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ హాజరయ్యారు. ఇంకా ఈ వేడుకలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, బాలీవుడ్ నటీనటులు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కత్రినా కైఫ్, విద్యాబాలన్ దంపతులతో పాటు కొత్త జంట ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ తదితరులు హాజరయ్యారు. 

More Telugu News