Nellore: అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లిన కారు.. 10 మందికి గాయాలు

  • నెల్లూరు పట్టణంలో సంఘటన 
  • అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టిన వైనం 
  • ఇద్దరి పరిస్థితి విషమం

నెల్లూరులో ఓ కారు అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. పట్టణంలోని బొల్లినేని ఆసుపత్రి వద్ద ఈ కారు అదుపు తప్పి అడ్డొచ్చిన వాహనాలను ఢీకొనడంతో పాటు రోడ్డుపై వెళుతున్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News