Chirala: చీరాలలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

  • సుబ్బయ్యను స్టేజి మీదకు పిలవలేదని ఘర్షణ
  • బాలాజీ, సుబ్బయ్య వర్గాల మధ్య తోపులాట
  • పరిస్థితిని అదుపు చేసిన మోపిదేవి

ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘర్షణకు దారి తీసింది. నేటి ఉదయం చీరాల వైసీపీ కార్యకర్తలతో పాటు బాపట్ల వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్ మోపిదేవి వెంకట రమణ, పరిశీలకుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి కూడా ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పొత్తూరి సుబ్బయ్యను స్టేజి మీదకు పిలవకపోవడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు.

గత ఎన్నికల్లో ఎక్కువ మంది కౌన్సిలర్లను గెలిపించడంలో కీలక పాత్ర వహించిన సుబ్బయ్యను పిలవకపోవడమేంటని నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాలాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలాజీ, సుబ్బయ్య ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పెద్ద ఎత్తున తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మోపిదేవి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.

More Telugu News