paruchuri: 'జనతా గ్యారేజ్' క్లైమాక్స్ విషయంలో కొరటాల పొరపాటు చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • సూపర్ హిట్ అయిన 'జనతా గ్యారేజ్'
  • కొరటాల చాలా తెలివిగా ఆలోచించారు 
  • మోహన్ లాల్ తోనే కొడుకును చంపించారు   

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "కథా పరంగా మోహన్ లాల్ .. దేవయానిల కొడుకు విద్రోహులతో చేతులు కలిపి అజయ్ ని చంపేస్తాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ వచ్చి చెబితే 'ఏం చేద్దాం?' అని మోహన్ లాల్ అడిగితే .. 'చంపేద్దాం' అని ఎన్టీఆర్ సమాధానమిస్తాడు.

తన కన్న కొడుకుని చంపొద్దని దేవయాని వేడుకుంటే, 'అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని .. కొడుకుల్ని కొట్టేయక తప్పదు' అని మోహన్ లాల్ అంటాడు. దాంతో ఎన్టీఆర్ వెళ్లి మోహన్ లాల్ కొడుకుని చంపేస్తాడని ఆడిటోరియంలో వున్న వాళ్లంతా అనుకుంటారు. అలాగే గనుక కొరటాల చేస్తే .. ఆడియన్స్ లో కొంతమందైనా అసంతృప్తికి లోనయ్యేవాళ్లు. కానీ అలా జరక్కుండా మోహన్ లాల్ చేత కొడుకుని చంపించాడు. క్లైమాక్స్ విషయంలో కొరటాల కరెక్టుగా ఆలోచించాడు' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News