mohanlal: 'ఒడియన్' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • ప్రయోగాత్మక చిత్రంగా 'ఒడియన్'
  • డిఫరెంట్ లుక్స్ తో మోహన్ లాల్ 
  • హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్  

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'ఒడియన్' రూపొందింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమైంది. సూపర్ పవర్స్ కలిగిన విభిన్నమైన పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు.

మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తారు. ఇంతవరకూ మోహన్ లాల్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆ చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.         

More Telugu News