Telangana: తెలంగాణ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన గ్రామం.. అధికారులు బతిమాలినా కరగని ఓటర్లు

  • నేతల తీరుకి నిరసనగా ఎన్నికలు బాయ్‌కాట్
  • ఎన్నికలను బహిష్కరించిన మొట్ల తిమ్మాపూర్
  • కలిసికట్టుగా ఉన్న గ్రామస్థులు

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 69.1 శాతం ఓటింగ్ నమోదైంది. చాలా నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తారు. ఖమ్మం జిల్లా మధిరలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లోని మలక్‌పేటలో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. ప్రతీ చోట ఎక్కువో, తక్కువో ఓటింగ్ అయితే నమోదైంది. అయితే, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మొట్ల తిమ్మాపూర్‌ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. గ్రామం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు.

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడని, హామీలన్నీ గాలికేనని గ్రామస్థులు వాపోయారు. కనీస సౌకర్యాలకు కూడా తాము నోచుకోలేదని, ఒక్క నాయకుడు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పట్టించుకోని నాయకులు ఇప్పుడొచ్చి అదిచేస్తాం, ఇది చేస్తాం ఓటెయ్యండి అని చెప్పినంత మాత్రాన ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విషయం తెలిసిన అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ బతిమాలినా ఓటర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు నిరాశగా వెనుదిరిగారు.

More Telugu News