venkatesh: 'వెంకీ మామ'కోసం వెంకటేశ్ వచ్చేస్తున్నాడు

  • బాబీ దర్శకుడిగా 'వెంకీ మామ'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • వేసవి సెలవుల్లో విడుదల

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా షూటింగును పూర్తి చేసిన వెంకటేశ్, మరో మల్టీ స్టారర్ షూటింగులో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నాడు. వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా దర్శకుడు బాబీ 'వెంకీమామ' అనే సినిమాను చేస్తున్నాడు. గత నెల 17వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

ఇంతవరకూ చైతూకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. త్వరలో ఈ సినిమా షూటింగులో వెంకటేశ్ జాయిన్ అవుతున్నట్టుగా సమాచారం. వెంకటేశ్ .. చైతూ కాంబినేషన్లోని సన్నివేశాలను సంక్రాంతి వరకూ ఏకధాటిగా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హుమా ఖురేషి .. చైతూ జోడీగా రకుల్ కనిపించనున్నారు. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.   

More Telugu News