varun: 'అంతరిక్షం'లో పార్వతి టీచర్ గా లావణ్య త్రిపాఠి

  • సంకల్ప్ రెడ్డి నుంచి 'అంతరిక్షం' 
  • ఈ నెల 9వ తేదీన ట్రైలర్ రిలీజ్ 
  • 21వ తేదీన సినిమా విడుదల  

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'అంతరిక్షం' సినిమా నిర్మితమైంది. లావణ్య త్రిపాఠి .. అదితీరావు ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను .. 21వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ తోపాటు అదితీరావు వ్యోమగామిగా కనిపించనుంది. ఇక లావణ్య త్రిపాఠి .. పార్వతి టీచర్ పాత్రను పోషించింది. తాజాగా ఆమె పాత్రను రివీల్ చేస్తూ ఒక ఆడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. "ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కూతురిగా కాదు .. పార్వతి టీచర్ గా నాకు గుర్తింపు వుంది. గోల్ ఓరియెంటెడ్ ఇండిపెండెంట్ పీపుల్ అంటే నాకు ఇష్టం. నా 24 యేళ్ల జీవితంలో మా నాన్నలాంటి వ్యక్తిని చూస్తానా అని అనుకున్నా .. చూశాను. దేవ్ కి దేశం మీద ఎంత ప్రేమ వుందో .. తనపై నాకు అంత ప్రేమ వుంది" అంటూ లావణ్య త్రిపాఠి చెప్పిన డైలాగ్స్ ఆమె పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.    

More Telugu News