muslim: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. రిజర్వేషన్ల శాతం పెంచాలన్న పిటిషన్ తిరస్కరణ!

  • రిజర్వేషన్ల పెంపు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ తీర్పు
  • తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలను పట్టించుకోని సుప్రీం

  రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ... రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం... రిజర్వేషన్లను పెంచడం కుదరదని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పును వెలువరించింది.

More Telugu News