raghavendra rao: ఛానల్స్ మమ్మల్ని సంప్రదించి వార్తలు వేయాలి.. ఎవరిమీదో అలిగి వెళ్లేంత కుసంస్కారిని కాను: రాఘవేంద్రరావు

  • ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది
  • వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను
  • నేను బాధ్యత కలిగిన వ్యక్తిని

హైదరాబాదు ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు చెప్పారు.

మీడియాతో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, 'క్యూలో నిలబడలేక నేను వెళ్లిపోయానని టీవీలో వచ్చింది. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను. క్యూలో ఉన్న ఓటర్లు ఎవరూ నన్ను అభ్యంతరపెట్టలేదు. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కారం కలిగిన వ్యక్తిని కాను. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయండి' అని తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను చాలా బాగా చేశారని కితాబిచ్చారు.

More Telugu News