ajith: భారీ రేటుకు 'విశ్వాసం' శాటిలైట్ రైట్స్

  • శివ దర్శకత్వంలో మరోసారి అజిత్ 
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ 
  • సంక్రాంతికి భారీ విడుదల    

అజిత్ కథానాయకుడిగా దర్శకుడు శివ 'విశ్వాసం' సినిమాను రూపొందించాడు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే నయనతారకి వున్న ఇమేజ్ కూడా సాధారణమైనదేం కాదు. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఈ కారణంగానే ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం అక్కడి ఛానల్స్ మధ్య గట్టిపోటీ నెలకొంది. చివరికి భారీ మొత్తం చెల్లించి శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ కెరియర్లోనే ఇది రికార్డు స్థాయి రేటు అని అంటున్నారు. ఈ సినిమాతోపాటు సంక్రాంతికి రజనీకాంత్ 'పెట్టా' రంగంలోకి దిగుతోంది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని అజిత్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   

More Telugu News