Chandrababu: 13 సీట్లు, రూ. 1000 కోట్లు... ఇదే గిన్నిస్ కన్నా పెద్ద రికార్డు: విజయసాయిరెడ్డి

  • తెలంగాణలో పట్టుబడిన డబ్బులో రూ. 125 కోట్లు చంద్రబాబుదే
  • ఆంధ్రా ప్రజలను దోపిడీ చేసి తరలించాడు
  • లోతైన విచారణ జరిపితే నిజం నిగ్గుతేలుతుందన్న విజయసాయి

తెలంగాణ ఎన్నికల సందర్భంగా పట్టుబడిన రూ. 130 కోట్లలో రూ. 125 కోట్లు చంద్రబాబు డబ్బేనని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో వరుస పోస్టులు పెట్టారు. "తెలంగాణాలో పట్టుబడిన రూ.130 కోట్లలో 125 కోట్లు చంద్రబాబు పంపించిందే. ఆంధ్ర ప్రజల నుంచి దోపిడి చేసిన సొమ్మును నిస్సిగ్గుగా తరలిస్తున్నాడు. 13 సీట్లలో పోటీచేస్తున్న పార్టీ వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టడం బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగదు. గిన్నిస్ కంటే పెద్ద సంస్థ ఏదైనా ఉంటే దీనిని తప్పని సరిగా నమోదు చేస్తుంది" అని ఆయన అన్నారు.

 ఆపై "హవాలా వ్యాపారుల ద్వారా తెలంగాణా కూటమికి అభ్యర్దులకు అందుతున్న డబ్బంతా చంద్రబాబు పంపించిందే. దీనిపై లోతైన విచారణ జరిపి బాబు, ఆయన బినామీలపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలి. హైదారాబాద్ లో 20 మంది హవాలా వ్యాపారులపై కేసులు నమోదయ్యాయి. వారు ఎవరి కోసం పని చేస్తున్నారో తేలితే బాబు బుక్ అవడం ఖాయం" అని అభిప్రాయపడ్డారు.

More Telugu News