Koratala Siva: చిరూ సినిమాతోను సందేశం ఇవ్వనున్న కొరటాల

  • 'సైరా'తో బిజీగా చిరంజీవి 
  • స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు 
  • జనవరిలో లాంచ్ చేసే అవకాశం    

ప్రస్తుతం చిరంజీవి 'సైరా'కి సంబంధించిన పనులతో బిజీగా వున్నారు. ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మరికొన్ని భారీ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే కొరటాల కసరత్తు చేస్తున్నారట. ఈ పనిని చాలా వరకూ ఆయన పూర్తి చేశారనే అంటున్నారు.

కొరటాల సినిమాల్లో సందేశం తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా సందేశంతో కూడినదిగానే ఉంటుందనేది తాజా సమాచారం. యాక్షన్ సన్నివేశాలతో పాటు రైతు సమస్యలకి సంబంధించిన సందేశం ఉంటుందని అంటున్నారు. రైతు పాత్రలో చిరంజీవి కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేసి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.    

More Telugu News