jagityala: మెట్ పల్లిలో మధుయాష్కీకి చేదు అనుభవం!

  • కొమ్మిరెడ్డి రాములు వర్గీయుల అసంతృప్తి
  • అడ్డుకున్న రాములు వర్గీయులు
  • డబ్బు పంచేందుకు వచ్చారంటూ అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

టీ-కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీకి చేదు అనుభవం ఎదురైంది. మెట్ పల్లిలో మధు యాష్కీని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నేతలు అడ్డుకున్నారు. ఓ వైద్యుడి ఇంటికి వచ్చిన ఆయన్ని కొమ్మిరెడ్డి రాములు వర్గీయులు అడ్డుకున్నారు. మధు యాష్కీ కారణంగానే తమ నాయకుడికి టికెట్ రాలేదని రాములు వర్గీయులు ఆరోపిస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

కాగా, టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా మధుయాష్కీకి చేదు అనుభవం ఎదురైంది. మెట్ పల్లిలో డబ్బులు పంచేందుకే యాష్కీ ఇక్కడికి వచ్చారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వారి మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే తన కారును వదిలేసి ద్విచక్రవాహనంపై మధుయాష్కీ వెళ్లిపోయారు.

More Telugu News