sensex: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం.. కుప్పకూలిన మార్కెట్లు

  • అంతర్జాతీయంగా ప్రతికూలతలు.. బలహీనపడ్డ రూపాయి విలువ
  • ఎగ్జిట్ పోల్స్ పై దృష్టి సారించిన ఇన్వెస్టర్లు
  • 572 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, రూపాయి విలువ బలహీనపడటం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో, ఎలక్షన్ ట్రెండ్స్ పై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. వీటన్నింటి ప్రభావంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 572 పాయింట్లు పతనమై 35,312కు జారిపోయింది. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 10,601కి దిగజారింది.

టాప్ గెయినర్స్:
వక్రాంగీ (4.97%), సొనాటా సాఫ్ట్ వేర్ (4.50%), హెచ్డీఐఎల్ (4.17%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (4.02%), పీఐ ఇండస్ట్రీస్ (3.49%).

టాప్ లూజర్స్:
నవకార్ కార్పొరేషన్ (-10.35%), శారద క్రాప్ కెమ్ లిమిటెడ్ (-7.67%), ఎన్సీసీ (-7.27%), ముత్తూట్ ఫైనాన్స్ (-7.10%), సౌత్ ఇండియన్ బ్యాంక్ (-6.19%).     

More Telugu News