venkatesh: 'ఎఫ్ 2' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

  • పూర్తి వినోదభరిత చిత్రంగా 'ఎఫ్ 2'
  • తొలిసారి వరుణ్ చేసిన కామెడీ మూవీ ఇదే 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'పటాస్'.. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రతి సినిమా విజయంలోను కామెడీ ప్రధానమైన పాత్రను పోషించింది. అందువల్లనే ఈసారి కామెడీనే ప్రధాన కథాంశంగా ఎంచుకుని ఆయన 'ఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా చేసిన ఈ సినిమా ఇటీవలే షూటింగును పూర్తి చేసుకుంది.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు. 'మల్లీశ్వరి' తరువాత వెంకటేశ్ చేసిన పూర్తి వినోదభరిత చిత్రం ఇదేనని అంటున్నారు. ఇక ఈ తరహా సినిమా చేయడం వరుణ్ తేజ్ కి ఇదే మొదటిసారి. కామెడీని పండించడంలో వరుణ్ తేజ్ మెప్పిస్తే ఇక తిరుగులేనట్టేనని అంటున్నారు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.  

More Telugu News