Nokia 8.1: అద్భుత ఫీచర్లతో నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్ విడుదల!

  • 'నోకియా 8.1' దుబాయ్ లో విడుదల 
  • ఈనెల 10న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం 
  • దీని ధర సుమారుగా రూ.32,200గా ఉండవచ్చు

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తన నూతన స్మార్ట్ ఫోన్ 'నోకియా 8.1' ని విడుదల చేసింది. 'ఆండ్రాయిడ్ 9పై' ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ ఫోన్లో భారీ టచ్ స్క్రీన్, డ్యూయల్ కెమెరాలాంటి ఫీచర్లని ఏర్పాటు చేశారు. ఈనెల 10న భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ధర సుమారుగా రూ.32,200గా ఉండే అవకాశం ఉంది.

నోకియా 8.1 ప్రత్యేకతలు:

  • 6.8" ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2244 పిక్సల్స్)
  • స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 12/13 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలు
  • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News