China: నగ్నంగా ఫొటో ఇస్తేనే అమ్మాయికి విద్యారుణం... చైనాలో బట్టబయలైన భారీ స్కామ్!

  • ఆర్థిక బలహీనతలను ఆసరాగా తీసుకున్న కంపెనీ
  • న్యూఢ్ ఫొటోలు తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు డబ్బులు
  • రంగంలోకి దిగిన అధికారులు

అమ్మాయిలు నగ్నంగా దిగిన సెల్ఫీలను హామీగా తీసుకుంటున్న ఓ సంస్థ, వారికి విద్యారుణాలను ఇస్తున్న స్కామ్ చైనాలో ఇప్పుడు వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. చైనీస్ ఈ-కామర్స్ పేరిట ఏర్పడిన ఓ స్టార్టప్ సంస్థ ఈ దందా సాగించింది. చదువుకునేందుకు తగినంత డబ్బులేని వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి న్యూడ్ ఫొటోలు స్వీకరించి, రుణాలను ఇచ్చింది.

 భవిష్యత్తులో వారు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, వాటిని బయట పెడతామని బెదిరించాలన్నది ఈ సంస్థ ఉద్దేశం. ఇక రోజువారీ ఖర్చులు, కాలేజీ ఫీజుల కోసం ఎంతోమంది అమ్మాయిలు వీరి వలలో చిక్కుకుని, తమ దృశ్యాలను తామే వారికి అందించి, అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నారని తెలుస్తోంది. చైనా ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగుతూ ఉండటం, విషయం బయటకు పొక్కి, నిరసనలు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. సంస్థ లావాదేవీలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

More Telugu News