'పెట్టా'నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫస్టులుక్

06-12-2018 Thu 12:03
  • కార్తీక్ సుబ్బరాజు నుంచి 'పెట్టా'
  • కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి 
  • నాయికలుగా సిమ్రాన్ .. త్రిష
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'పెట్టా' సినిమా రూపొందింది. కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ముఖ్య పాత్రధారుల ఫస్టులుక్స్ ను వదులుతూ వస్తున్నారు. రజనీకాంత్ .. విజయ్ సేతుపతి పాత్రలను పరిచయం చేస్తూ ఇప్పటికే వదిలిన ఫస్టులుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాస్త వయసు పైబడిన మధ్యతరగతి వ్యక్తిగా ఈ పోస్టర్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపిస్తున్నాడు. సహజమైన నటనకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే నవాజుద్దీన్ సిద్ధిఖీ లుక్ .. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇది తొలిసారిగా ఆయన చేసిన తమిళ చిత్రం కావడంతో, ఆయన అభిమానులు ఆసక్తితో వున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా సిమ్రాన్ .. మరో కథానాయికగా త్రిష కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.