warangal district: ఖాజీపేటలో కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా పట్టుబడ్డ డబ్బు!

  • కాంగ్రెస్ నేత అమృతరావు వద్ద పట్టుబడ్డ రూ.3 కోట్లు
  • తన ఇంటి పక్క ఇంట్లో డబ్బును దాచిన వైనం
  • పోలీసుల అదుపులో అమృతరావు, ఇంటి యజమాని  

వరంగల్ జిల్లాలోని ఖాజీపేటలో కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంచే నిమిత్తం ఈ డబ్బు ఆయన వద్ద ఉన్నట్టు సమాచారం. స్థానిక సిద్ధార్థనగర్ లో నివసిస్తున్న కాంగ్రెస్ నేత అమ‌ృతరావు వద్ద రూ.3 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ సొమ్మును ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్టు పోలీసులు చెప్పారు. అమృతరావు తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని అద్దె తీసుకుని, ఆ ఇంట్లో ఈ డబ్బును దాచి పెట్టి, కార్యకర్తల ద్వారా ఓటర్లకు పంచేందుకు ప్లాన్ వేశారు. ఈ మేరకు పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అమృతరావుతో పాటు ఇంటి యజమానిని అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News