Jee sat-11: జీశాట్-11 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఇకపై మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం!

  • బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తుంది
  • దీని బరువు 5,854 కిలోలు
  • భారత్‌కు విలువైన అంతరిక్ష ఆస్తి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సమాచార ఉపగ్రహం జీశాట్-11ను దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. దేశమంతటా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంతోపాటు కొత్తతరం అప్లికేషన్ల రూపకల్పనకు ఇది వేదికగా నిలవగలదని భావిస్తున్నారు.

ఇప్పటి వరకూ ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలోకి ఇది చాలా బరువైంది. దీని బరువు 5,854 కిలోలు. ఈ ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ మోసుకెళ్లిన 33 నిమిషాల అనంతరం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ‘బిగ్‌ బర్డ్’గా పిలుచుకునే జీ శాట్-11 ఉపగ్రహం తయారీకి రూ.600 కోట్లను ఇస్రో వెచ్చించింది. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. జీశాట్‌-11 ఉపగ్రహం దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం అందించనుందని.. ఇది భారత్‌కు విలువైన అంతరిక్ష ఆస్తిగా నిలవనుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.

More Telugu News